NTV Telugu Site icon

PM Modi: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారింది.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నెంబర్ వన్..

Pm Modi

Pm Modi

PM Modi: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నంబర్ వన్ గా ఉందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వేంట్స్ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొబైల్ డేటా అతి చౌకగా లభించే దేశాల్లో భారత్ో ఒకటని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది సివిల్ సర్వీస్ డే చాలా ముఖ్యమైనదని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో బృహత్తరమైన లక్ష్యాలను సాధించేందుకు దేశం వేగంగా అడుగులు వేస్తున్న తరుణం ఇది అని ఆయన చెప్పారు.

Read Also: Poonch terror attack: పూంచ్ ఉగ్రదాడిలో ఏడుగురు టెర్రరిస్టుల హస్తం..

సివిల్ సర్వీసెస్ అధికారిని ఉద్దేశిస్తూ.. మీరు ఈ కాలంలో పనిచేస్తుండటం మీ అదృష్టం అని, దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్లు చేస్తున్న కృషిని కొనియాడుతూ.. గడిచిన తొమ్మిదేళ్లలో దేశం పురోగమిస్తుందని, వారి కృషి లేకుండా అది సాధ్యమయ్యేది కాదని అన్నారు. మన లక్ష్యాలు కష్టతరమైనప్పటికీ, తక్కువ సమయం ఉన్నప్పటికీ మాకు చాలా సామర్థ్యం, ధైర్యం ఉందని ప్రధాని చెప్పారు.

గత 9 ఏళ్లలో భారత అభివృద్ధి ఊపందుకుందని, కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతీ వనరుని సద్వినియోగం చేసుకుని సేవ చేయాలనే దృక్పథంతో పనిచేస్తుందని అన్నారు. మా మంత్రం ‘‘నేషన్ ఫస్ట, సిటిజన్ ఫస్ట్’’అని మోదీ తెలిపారు. దేశంలో వివిధ పబ్లిక్ సర్వీస్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులందరి పనిని గుర్తించేందుకు ఏప్రిల్ 21న ‘ సివిల్ సర్వీసెస్ డే’ని జరుపుకుంటున్నారు.

Show comments