Nepal: భారతదేశ వ్యాపారవేత్త తనను ప్రధాని చేయడానికి ప్రయత్నాలు చేశారంటూ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో అగ్గిరాజేశాయి. ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు నేపాల్ రాజకీయాల్లో భారత్ కలుగజేసుకోవడంపై విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా ప్రచండను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ప్రచండ వ్యాఖ్యలపై విపక్షాల్లోనే కాకుండా సొంత పార్టీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచండ వ్యాఖ్యలు నేపాల్ జాతీయ సార్వభౌమాధికారం, జాతీయవాదానికి దెబ్బ అని ఓలి అన్నారు.
Read Also: Heavy Rains: రానున్న 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. కర్నాటకలో 8 మంది మృతి
అయితే ప్రధాని ప్రచండ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ వివాదంలోకి భారతదేశాన్ని లాగవద్దని శుక్రవారం అన్నారు. నేపాల్ లోని నేపాల్‌లోని ట్రక్కింగ్ వ్యవస్థాపకుడు సర్దార్ ప్రీతమ్ సింగ్‌పై ప్రచండ చేసిన వ్యాక్యలతో ఈ వివాదం ప్రారంభమైంది. ఆయన తనను ప్రధాని చేసేందుకు ప్రయత్నించారని.. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఖాట్మండులో రాజకీయ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారని, ఓ పుస్తకావిష్కరణ సమయంలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు అక్కడి పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళానికి దారి తీశాయి.
నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మాట్లాడుతూ.. నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం చేసుకోవడం నేపాల్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని భారతదేశానికి బాగా తెలుసు, భారత దేశం అలా చేయదు, చేయలేదు అని ఆయన అన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రీతమ్ సింగ్ తిరస్కరించారని ఓలి అన్నారు. నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటును సులభతరం చేస్తామని స్నేహపూర్వక దేశమైన భారతదేశం ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు. అలా మాట్లాడటం నేపాల్ సార్వభౌమాధికారానికి విరుద్ధమని భారతదేశానికి బాగా తెలుసు అని ఓలి చెప్పారు.
