Covid Outbreak: మరో కోవిడ్ ముప్పుకి భారత్ సిద్ధంగా ఉండాలి..
- మరో కోవిడ్ వేవ్‌కి భారత్ సిద్ధంగా ఉండాలి..
- అమెరికా..దక్షిణ కొరియాలో పెరుగుతున్న కేసులు..
- నిపుణుల హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Outbreak: భారత్ మరో కోవిడ్ వ్యాప్తికి సిద్ధంగా ఉండాలని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) నిపుణుడు శుక్రవారం హెచ్చరించారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వచ్చాయి. సీడీసీ అంచనాల ప్రకారం.. యూఎస్‌లో దేశంలోని 25 రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో కూడా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా గణాంకాల ప్రకారం.. జూన్ 24 మరియు జూలై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీ వారం సగటున 17,358 కోవిడ్ నమూనాలను పరీక్షించారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం భారత్‌లో కూడా 908 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్-జూలై మధ్య రెండు మరణాలు సంభవించాయి. ఇతర దేశాల మారిగానే భారత్‌లో పరిస్థితి తీవ్రంగా లేనప్పటికీ మనం దీనికి సిద్ధంగా ఉండాలని నోయిడాలోని శివ్ నాడార్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ దీపప్ సెహగల్ చెప్పారు. వైరస్ ఖచ్చితంగా తిరిగి పుంజుకుందని, ఈ వైరస్ సంభవించిన వారిలో 26 శాతం మరణాలు, 11 శాతం పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్ఓ నివేదించింది. ఇది ఆందోళనకరమైన విషయమని అన్నారు.
Also Read
ఇటీవల వ్యాప్తిలో KP వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఓమిక్రాన్ వంశానికి చెందినది. ఓమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణంతో పాటు రోగనిరోధక శక్తిని తప్పించుకునే లక్షణం ఉంది. జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ జేఎన్.1 నుంచి KP.2 వేరియంట్ పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. భారతదేశంలో కేపీ.2 మొదటిసారిగా డిసెంబర్ 2023 ఒడిశాలో కనుగొన్నారు.
కేపీ.2 జాతి ఓమిక్రాన్ వేరియంట్ నుంచి స్పైక్ రీజియన్‌లో మూడు మ్యూటేషన్లను కలిగి ఉంది. INSACOG (ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) నుండి వచ్చిన డేటా, ఈ వేరియంట్ ఇప్పటికే భారతదేశంలో ఉందని చూపింది. KP.x — ఇందులో KP.3.1.1 మరియు FLiRT వేరియంట్ లేదా KP.2 వంటి దానికి సంబంధించి జాతులు ఉన్నాయి. జూలై చివరి వారంలో సేకరించిన భారతదేశంలోని మొత్తం కోవిడ్ సీక్వెన్స్ శాంపిల్స్‌లో దాదాపు 39 శాతం ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ డాష్ బోర్డులో భారత్ లోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలను చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 279 యాక్టివ్ కేసులు8 ఉన్నాయి. JN.1 ఓమిక్రాన్ నుంచి ఉద్భవించిన KP.1 మరియు KP.2 జాతులు భారతదేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమవుతాయి.
తాజావార్తలు
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!