Akash Missile: న్యూ జనరేషన్ “ఆకాష్ మిస్సైల్” ప్రయోగం సక్సెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటిఆర్) నుండి న్యూజనరేషన్ ఆకాష్ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిందని అధికారులు తెలిపారు. డీఆర్డీఓ అధికారులు ఈ పరీక్షను నిర్వహించారు. తక్కువ ఎత్తులో మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఛేదించేలా ఫ్లైట్ టెస్ట్ జరిగింది. ఆకాష్ ఆయుధ వ్యవస్థలోని అన్ని విభాగాలు అత్యంత ఖచ్చితత్వంలో పనిచేశాయని అధికారులు వెల్లడించారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాష్ మిస్సైల్ లోని రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్ మరియు కమాండ్, కంట్రోల్ & కమ్యూనికేషన్ సిస్టమ్, పూర్తి ఆయుధవ్యవస్థ పనితీరును అధికారులు ధ్రువీకరించారు. రాడార్లు, టెలీమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మిస్సైట్ డేటా ద్వారా సిస్టమ్ పనితీరును ధ్రువీకరించారు.
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
Read Also: Union Minister Kishan Reddy: మూడు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
విమాన పరీక్షను DRDO, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. AKASH-NG వ్యవస్థ శత్రువుల నుంచి అత్యంత వేగంగా వచ్చే వైమానిక ముప్పును ఎదుర్కొగలదు. ఈ పరీక్ష విజయంతో యూజర్ ట్రయల్స్‌కి మార్గం సుగమమైంది.
ఆకాష్ న్యూజనరేషన్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, ఐఏఎఫ్‌ని అభినందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందని అన్నారు.
Next Generation Akash missile successfully flight tested from ITR , Chandipur off the coast of Odisha today at 10:30hrs against a high speed unmanned aerial target at very low altitude. @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/ShRNi4dfAj
— DRDO (@DRDO_India) January 12, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!