Site icon NTV Telugu

Modi-Trump: అమెరికాపై ప్రతీకార సుంకాలకు భారత్ రెడీ.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్రణాళిక!

Modi223

Modi223

అగ్ర రాజ్యం అమెరికా-భారత్ మధ్య సుంకాల వార్ నడుస్తోంది. నిన్నామొన్నటిదాకా మంచి స్నేహ సంబంధాలు ఉన్న దేశాలు.. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. మొత్తంగా ఆసియా దేశాల్లో అత్యధికంగా భారత్‌పైనే సుంకం విధించారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ పరిమాణంపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. తమకు అన్నదాతలే ముఖ్యమని.. ఎంత టారిఫ్‌లైనా భరిస్తామంటూ తెలిపారు. రైతుల కోసం ఎక్కడా రాజీపడబోమని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీకి జెలెన్‌స్కీ ఆహ్వానం.. వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే..!

అయితే తాజాగా అమెరికాపై ప్రతీకార సుంకాలకు భారత్‌ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలలోనే తొలి ప్రతీకార చర్య ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎంపిక చేసిన అమెరికా వస్తువులపై సుంకాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సుంకాలపై తేలే వరకు భారత్‌తో ఎలాంటి చర్చలు ఉండవని ట్రంప్ తేల్చి చెప్పారు. చర్చలకు వాషింగ్టన్ ముందుకు రాకపోవడంతో ప్రతీకారం తీర్చుకోవడమే ముందున్న మార్గమని.. మరొక మార్గం లేదని విషయాలు తెలిసిన వ్యక్తి ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Vijay Devarakonda : కెరీర్ నాశ‌నం చేసుకోవద్దంటు.. విజయ్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

ఆసియా దేశాలపై టారిఫ్‌లు ఇలా..
భారత్- 50 శాతం
సిరియా-41 శాతం
మయన్మార్-40 శాతం
లావోస్- 40 శాతం
ఇరాక్ -35 శాతం
చైనా -30 శాతం
కజికిస్థాన్-25 శాతం
వియత్నాం- 20 శాతం
శ్రీలంక-20 శాతం
పాకిస్థాన్-19 శాతం టారిఫ్ విధించారు.

Exit mobile version