NTV Telugu Site icon

Tejas MK1A: తేజస్ ఇంజిన్ డెలివరీ ఆలస్యం.. అమెరికన్ కంపెనీకి భారత్ భారీ జరిమానా..

Tejas Mk1a

Tejas Mk1a

Tejas MK1A: స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ MK1A కోసం ఇంజిన్లను అందించే అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్ట్రిక్(GE) ఏరోస్పేస్ తేజస్ కోసం F404-IN20 ఇంజిన్‌లను అందించడంలో విఫలమైంది. నిజానికి జీఈ 2023లోనే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాలి. చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటనల సందర్భంగా ఆలస్యాన్ని లేవనెత్తినట్లు నివేదికలు తెలిపాయి.

తేజస్ విమానాల తయారీ వేగంపై భారత వైమానిక దళం (IAF) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆగస్టులో పలు నివేదికలు పేర్కొన్నాయి. మొదటి విమానం మార్చి 31, 2024 నాటికి ఐఏఎఫ్‌కి అందించాలి. అయితే, తేజస్ తయారీదారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నవంబర్ 2024కి డెలివరీని అంచనా వేసింది. ఆగస్టు నాటికి జీఈ ఏరోస్పేస్ F404 ఇంజిన్‌ల డెలివరీ ఒక సంవత్సరం పాటు ఆలస్యం చేసింది. సప్లై చైన్ సమస్యల వల్ల ఆలస్యం అయినట్లు కంపెనీ నివేదించింది. అయితే, మార్చి 2023 నాటికే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మార్చి లేదా ఏప్రిల్ 20254 నాటికి డెలివరీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది.

Read Also: PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్‌ సిటిజన్లకు ప్రధాని క్షమాపణ..

ఇంజిన్ల డెలివరీలో జాప్యం కారణంగా ఐఏఎఫ్ పోరాట సంసిద్ధతపై ప్రభావం పడుతోంది. తేజస్ విమానాల తయారీ వేగాన్ని పెంచాలని హెచ్ఏఎల్‌ని కోరింది. ఈ నేపథ్యంలోనే జీఈ కంపెనీకి వ్యతిరేకంగా భారత్ భారీ ఫెనాల్టీ విధించినట్లు తెలుస్తోంది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే ఆలస్యానికి పలుమార్లు ఫెనాల్టీలనున వేసినట్లు తెలుస్తోంది. జీఈ, హెచ్ఏఎల్ 2021 ఆగస్టు ఒప్పందం ప్రకారం.. 99 ఇంజిన్లను సరఫరా చేయాల్సి ఉంది.

డెలివరీల జాప్యంలో అమెరికా ఒత్తిడి వ్యూహాలు ఏమీ లేవని ప్రభుత్వ వర్గాలు తెలపుతున్నాయి. ఈజీ టై-అప్ అయిన దక్షిణ కొరియా సంస్థ ఆర్థిక సమస్యల కారణంగా ఇంజిన్ విడిభాగాలను అందించలేకపోయిందని చెప్పారు. దీనికి పరిష్కారంగా ఆ టెక్నాలజీని భారత్‌కి అందించాలని, వాటిని ఇక్కడే తయారు చేయవచ్చని ప్రభుత్వం జీఈకి తెలిపింది.