Site icon NTV Telugu

Pakistan Vs India: ఐక్యరాజ్యసమితిలో మరోసారి పాక్పై భారత్ ఫైర్..

India

India

Pakistan Vs India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు- సాయుధ సంఘర్షణ (CAAC)పై వార్షిక బహిరంగ చర్చ సందర్భంగా పాకిస్తాన్‌పై మరోసారి భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సొంత భూభాగంలో పిల్లలపై జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దారుణాలను ఇస్లామాబాద్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ, రాజకీయ ప్రేరేపిత ప్రకటనల కోసం అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటోందని UNలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఆరోపించారు.

Read Also: Crime News: ఏడేళ్ల కొడుకుకు మందు తాగించిన తండ్రి.. చివరకు ఏమైందంటే?

ఇక, CAAC ఎజెండాను వ్యతిరేకించిన వారిలో పాకిస్తాన్‌ ఒకటి అని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పిలిచారు. భారతదేశంపై దుమ్మెత్తి పోసేందుకు ఐక్యరాజ్య సమితి చట్టాలను వక్రమార్గం పట్టడానికి ఇస్లామాబాద్ చేస్తున్న ప్రయత్నాలను తిరస్కరించారు. పాకిస్తాన్ దుర్మార్గపు నిర్ణయాలను కొనసాగించడానికి వివిధ చర్చలలో భారతదేశంపై విషం చిమ్ముతుందన్నారు. కాగా, సెక్రటరీ జనరల్ ఇటీవలి నివేదికలో నమోదు చేయబడినట్లుగా, పిల్లలపై జరిగిన దారుణాల రికార్డు నుంచి దృష్టి మరల్చడానికే పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. అలాగే, పెరుగుతున్న సరిహద్దు ఉగ్రవాదం నుంచి దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ చేసిన ఈ ప్రయత్నాన్ని మేము తిరస్కరించామని పర్వతనేని హరీష్ చెప్పుకొచ్చారు.

Exit mobile version