Site icon NTV Telugu

Fertility Rate: దేశంలో భారీగా తగ్గిన సంతానోత్పత్తి.. గత పదేళ్లలో 20% డౌన్

Fertility Rate

Fertility Rate

Fertility Rate: పిల్లలను కనాలని పెళ్లి చేసుకున్న దంపతులు తాపత్రయపడుతుంటారు. అయితే కొందరు కొన్ని సమస్యల కారణంగా పిల్లలను కనడం వాయిదా వేసినా ఎప్పటికైనా పిల్లలను అయితే తప్పకుండా కనాల్సిందే. కానీ ప్రస్తుత జీవన విధానం ఈతరం మహిళల సంతానోత్పత్తి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు 20 శాతం పడిపోయిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా 2020 రిపోర్టు వెల్లడించింది. దేశంలోని ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో జన్మించిన చిన్నారుల సంఖ్యను జనరల్ ఫర్టిలిటీ రేట్(జీఎఫ్ఆర్)గా చెబుతారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో జీఎఫ్ఆర్ 29 శాతం తగ్గిపోయిందని రిపోర్టు తెలిపింది.

Read Also: Prabhas: ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటును పరిశీలిస్తే ఏపీలో 50.7 శాతం, తెలంగాణలో 52.6 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 28.5 శాతం మేర సంతానోత్పత్తి రేటు ఉంది. సంతానోత్పత్తి రేటు కోసం 15-49 సంవత్సరాల వయసులోని వారిని ఈ గణాంకాల పరిధిలోకి తీసుకుంటారు. 2008 -2010లో సగటు జీఎఫ్ఆర్ 86.1గా ఉంటే, 2018-20 మధ్య కాలంలో ఇది 68.7కు తగ్గింది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి క్షీణత 15.6 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతంగా ఉంది. జీఎఫ్ఆర్ గణాంకాలు జనాభావృద్ధి తగ్గుదలను సూచిస్తున్నాయని, ఇది మంచి సంకేతమేనని ఎయిమ్స్ ఆబ్సెట్రిక్స్ మాజీ హెడ్ సునీతా మిట్టల్ అన్నారు. వివాహం చేసుకుంటున్న వారి వయసు పెరగడం, మహిళల్లో అక్షరాస్యత శాతం పెరగడం, ఆధునిక సంతాన నిరోధక సాధనాల రాక సంతానోత్పత్తి తగ్గడానికి కారణాలుగా పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version