Site icon NTV Telugu

India Pakistan: పాక్ హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన భారత్..కారణం ఇదే..

India Pak

India Pak

India Pakistan: న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకమిషన్ కార్యాలయం వెలుపల కార్యకలాపాలకు పాల్పడినందుకు భారతదేశం నుంచి అతడిని బహిష్కరించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

Read Also: Law College: శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’కి బార్ కౌన్సిల్ ఆమోదం.. కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి

భారతదేశంలో తన అధికారిక హోదాకు అనుగుణంగా లేని కార్యకలాపాలకు పాల్పడినందుకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లాలని కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్‌కు ఈరోజు ఆదేశాలు జారీ చేయబడ్డాయి’’ అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version