India Pakistan: న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకమిషన్ కార్యాలయం వెలుపల కార్యకలాపాలకు పాల్పడినందుకు భారతదేశం నుంచి అతడిని బహిష్కరించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. భారత్ యాక్షన్‌లోకి దిగితే ఎలా ఉంటుందనే విషయం పాకిస్తాన్‌కి బాగా అర్థమైంది. ఇన్నాళ్లు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బెదిరిస్తూ వస్తున్న పాకిస్తాన్‌కి, అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది.
Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ గురించి త్రివిధ దళాల సైనికాధికారులు మాట్లాడారు. భారత సైన్యం మే 7-10 మధ్య జరిపిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 35-40 మంది చనిపోయినట్లు మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ శనివారం చెప్పారు.