Site icon NTV Telugu

Defence Budget: ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ బడ్జెట్ భారీగా పెంపు.. ఎంతంటే..!

Defencebudget

Defencebudget

ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థపై పోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైన్యానికి మరింత ప్రోత్సాహం అందించాలని కేంద్రం యోచిస్తోంది. దాయాది దేశంతో పాటు చైనాతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రూ.50, 000 కోట్ల ప్రోత్సాహం అందించాలని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్ ఎలాగైతే శత్రు క్షిపణులను ఎదుర్కొందో.. అలాగే ఆకాశ్ క్షిపణి రక్షణ వ్యవస్థతో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ క్షిపణులను తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో సప్లిమెంటరీ బడ్జెట్‌ ద్వారా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపు

ఈ ఏడాది రక్షణశాఖ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు. తాజాగా పెంపునకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దీంతో డిఫెన్స్‌కు కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.50 వేల కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్‌తో పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి: Weather Update : అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ భారీ వర్ష సూచన

ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది హిందువులు చనిపోయారు. మతం పేరుతో మారణహోమం సృష్టించారు. దీంతో పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలోనే రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.

Exit mobile version