అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. జేమ్స్ కామీ ‘‘8647’’ అనే పదాలను పోస్టు చేశారు. అంటే దీని అర్థం అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలా రహస్య కోడ్ ఇది. దీంతో కామీపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Weather Update : అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ భారీ వర్ష సూచన
ఈ విషయంపై జేమ్స్ కామీ స్పందించారు. తన పోస్ట్‌ను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఆ నెంబర్లు కొందరు హత్యలు చేసేందుకు ఉపయోగిస్తారన్న విషయం తెలియదన్నారు. అమెరికా అధ్యక్షుడ్ని చంపాలనే ఉద్దేశం తనకు లేదని.. హింస అంటేనే ఇష్టం ఉండదన్నారు. పోస్ట్‌ను అపార్థం చేసుకున్నందుకు డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఆరుగురు మ్యాచ్ విన్నర్స్ తిరిగొచ్చేశారు!
జేమ్స్ కామీ సెప్టెంబర్ 4, 2013లో ఎఫ్‌బీఐ ఏడవ డైరెక్టర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్ తొలి పాలనలో కొద్దికాలానికే 2017లో తొలగింపబడ్డారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ వివాదంపై కీలక దర్యాప్తులు కామీ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా మూడేళ్లకు పైగా పని చేశారు.
Ex-FBI Director James Comey under probe following "8647" post; Trump officials call it death threat
Read @ANI Story | https://t.co/FlUkla4Jsd#JamesComey #FBI #US #DonaldTrump pic.twitter.com/VajuHdnb1u
— ANI Digital (@ani_digital) May 16, 2025