Site icon NTV Telugu

India-China: భారతీయులకు గుడ్‌న్యూస్.. భారత్-చైనా విమాన సర్వీసులు ప్రారంభం ఎప్పుడంటే..!

Indiachina

Indiachina

భారతీయులకు గుడ్‌న్యూస్ అందింది. భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరు నాటికి రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: UP: బరేలీలో హై అలర్ట్.. 48 గంటలు ఇంటర్నెట్ సేవలు బంద్

గల్వాన్ ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ద్వైపాక్షిక సంబంధాలు జరిగాయి. అంతేకాకుండా గత నెలలో ప్రధాని మోడీ చైనాలో కూడా పర్యటించి వచ్చారు. అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చైనాలో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. దీంతో తిరిగి రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడంతో విమాన సర్వీసులపై తాజాగా ఒప్పందం జరిగింది. దీంతో అక్టోబర్ చివరి నాటికి విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి.

ఇది కూడా చదవండి: UP: వరకట్నం హత్య కేసులో షాకింగ్ ఘటన.. రెండేళ్ల తర్వాత బిగ్ ట్విస్ట్

పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. భారతదేశం-చైనా మధ్య ప్రజల మధ్య సంబంధాన్ని మరింత సులభతరం చేయనుంది. ద్వైపాక్షిక మార్పిడులు క్రమంగా సాధారణ స్థితికి తీసుకొస్తున్నాయని విదేశాంగ తెలిపింది. సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నందున అక్టోబర్ చివరి నుంచి ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం, చైనా అంగీకరించాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఒక అధికారిక ప్రకటనలో ప్రకటించింది.

దౌత్యపరమైన చొరవను అనుసరించి.. ఇండిగో విమానం 2025 అక్టోబర్ 26 నుంచి కోల్‌కతా నుంచి గ్వాంగ్‌జౌకు రోజువారీ నాన్-స్టాప్ విమానాలను నడపనుంది. చైనా భూభాగానికి తన సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఇండిగో ప్రకటించింది.

Exit mobile version