India-Canada: కెనడాలో అధికారుల బెదిరింపులకు వ్యతిరేకంగా కనీస భద్రత కూడా అందించలేకపోవడంతో.. టొరంటోలోని మరికొన్ని భారత కాన్సులర్ క్యాంపులను రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. నవంబరు 2, 3 తేదీల్లో బ్రాంప్టన్, సర్రేలోని రెండు శిబిరాలపై ఖలిస్తానీ గ్రూపులు జరిపిన దాడుల తర్వాత కెనడాలోని భారత హైకమిషన్ కొన్ని కాన్సులర్ క్యాంపులను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలకు దిగింది.
Read Also: PAC Chairman Election: పీఏసీ ఎన్నిక.. చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే..!
కాగా, గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని డయాస్పోరాలోని దాదాపు 4,000 మంది భారత్- కెనడియన్ ప్రజలకు అవసరమైన కాన్సులర్ సేవలను కోల్పోయిన.. వారికి తాము అండగా ఉంటామని కాన్సులేట్ ప్రకటించింది. ఇక, బ్రాంప్టన్‌లోని హిందూ సభా దేవాలయం ఆవరణలోకి ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రవేశించి అక్కడి భక్తులపై దాడి చేశారు. అంటారియో ప్రావిన్స్‌కు చెందిన పీల్ పోలీసులు ఖలిస్తానీ టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో కెనడాలో భద్రతా సమస్యల కారణంగా కాన్సులర్ సేవలను మూసివేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానిపై అరెస్టు వారెంట్లు జారీ
ఇక, సిక్కులు ఫర్ జస్టిస్, నిషేధిత ఖలిస్థానీ అనుకూల సమూహం.. పరిపాలనా సేవలలో సహాయం చేయడానికి వచ్చిన భారతీయ కాన్సులర్ అధికారులపై తరచూ దాడులకు దిగుతున్నాయి. అలాగే, కెనడాలోని భారతీయులకు అవసరమైన సేవలను ఇండియన్ ఎంబసీ అందిస్తోంది. వీటిని భారత వ్యతిరేక శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే, గత సెప్టెంబరులో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కుట్రలో భారత రాయాబారుల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఆ తర్వాత నుంచి భారత్- కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి.