Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News India Canada Reach Deal To Share Intelligence On Terrorism Crime

India Canada: దారికి వచ్చిన కెనడా.. ఇండియా దౌత్య విజయం..

Published Date :June 14, 2025 , 12:13 pm
By Venu Goapl Reddy
  • దారికి వస్తున్న కెనడా..
  • ఉగ్రవాదంపై ఇంటెలిజెన్స్ షేరింగ్‌కి భారత్‌తో ఒప్పందం..
  • హర్దీస్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత సాధారణంగా మారుతున్న సంబంధాలు..
India Canada: దారికి వచ్చిన కెనడా.. ఇండియా దౌత్య విజయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India Canada: కెనడా ఇప్పుడిప్పుడే దారికి వస్తోంది. గతంలో, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచాడు. తన రాజకీయాల కోసం భారత్‌తో సంబంధాలను పణంగా పెట్టాడు. ప్రస్తుతం, మార్క్ కార్నీ ప్రధానిగా గెలిచిన తర్వాత భారత్‌తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. జీ -7 సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని కెనడా ఆహ్వానించింది. స్వయంగా కెనడా ప్రధాని కార్నీ మోడీకి ఫోన్ చేశారు.

ఇదిలా ఉంటే, రెండు దేశాలు అంతర్జాతీయ నేరాలు, తీవ్రవాదం పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి సహకరించుకోవాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్, కెనడాలు నిఘా సమాచారాన్ని పంచుకోవాలని ఒక ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి. రెండు దేశాలు అంతర్జాతీయ నేరాలు, ఉగ్రవాదం, తీవ్రవాద కార్యకలాపాలపై సహకరించుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. జీ-7 సమావేశంలో భాగంగా , భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఈ ఒప్పందం భారత్‌కు దౌత్య విజయంగా చెప్పవచ్చు. కెనడా భారత వ్యతిరేకతకు కేంద్రంగా  మారుతోంది. పలువురు నేరస్తులు, ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడం కీలకం మారింది. కెనడా నుంచి భారత్‌లో ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని, మాఫియాను నడుపుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.

నిజ్జర్ హత్యతో దిగజారిన సంబంధాలు:

2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే, ఆయన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. కెనడావి అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా తిరస్కరించింది. దీని తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం ఏర్పడింది. రెండు దేశాలు కూడా దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada
  • india
  • India Canada Relations
  • Intelligence on Terrorism
  • PM Modi

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions