Gyanesh kumar vs INDIA Bloc: ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం.. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ప్లాన్
- ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం
- సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ఇండియా కూటమి ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని ఆధారాలను కూడా రాహుల్‌గాంధీ చూపించారు. దీనికి కౌంటర్‌గా ఆదివారం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించింది. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై ఆధారాలు చూపించాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇలా..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
తాజాగా సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం ఉంటుుంది. కానీ ప్రతిపక్షాలకు పార్లమెంట్లో అంత బలం లేదు. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానం పెడతారా? లేదా? అని తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: UP: మీరట్‌లో దారుణం.. జవాన్‌ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్ సిబ్బంది
ఇదిలా ఉంటే ఈసీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ బీహార్‌లో యాత్ర చేపట్టారు. 16 రోజుల పాటు ఓటరు అధికార్ యాత్ర పేరుతో యాత్ర చేపట్టారు. తేజస్వి యాదవ్‌తో కలిసి రాష్ట్రంలో యాత్ర చేస్తున్నారు. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓట్లు దొంగిలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. త్వరలోనే బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో దాడి తీవ్రతరం చేశారు. దేశమంతా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దొంగతనం జరుగుతుందని స్వరం పెంచారు.
బీహార్‌లో అక్టోబర్ లేదా నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నాయి. అయితే ప్రజలు ఈసారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..