Site icon NTV Telugu

US: రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయమని భారత్ హామీ ఇచ్చింది..

Us

Us

US:రష్యన్ చమురును కొనుగోలు చేయమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. మాస్కో ఇంధన రంగంపై అమెరికా విధించిన తాజా ఆంక్షల మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. శనివారం మ్యూనిచ్ భద్రతా సమావేశంలో రూబియో చెప్పినట్లు మీడియా నివేదించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఇంధన ఆదాయాన్ని కట్టడి చేయడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న పెద్ద దేశంగా భారత్ ఉంది.

Read Also: IND vs PAK: ‘‘భారత్‌కు శివరాత్రి, పాక్‌కు కాళరాత్రి’’.. మళ్లీ రేపు ఇదే రిపీట్ కావాలి..

ఇదిలా ఉంటే, తమ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం నిలిపేస్తున్నట్లు భారత్ ఎక్కడా చెప్పలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. భారత్, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని తగ్గించుకుంటుందా అనే ప్రశ్నల మధ్య భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ భారత విదేశాంగ విధానంలో స్వతంత్రత ఉందని, చమురు కొనుగోళ్లు కంపెనీల అవసరాలు, ధరలు, రిస్క్‌లను చూసుకుని నిర్ణయిస్తాయి.’’ అని అన్నారు.

Exit mobile version