NTV Telugu Site icon

Trump-Modi: వచ్చే నెలలో ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యే ఛాన్స్

Trumpmodi

Trumpmodi

ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం వచ్చే నెలలో ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా అమెరికా వెళ్తోంది. అలాగే భారత్ కూడా అమెరికాతో వాణిజ్య సంబంధాలను కూడా పెంపొందించుకునేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు ట్రంప్ వైట్‌హౌస్‌కు తిరిగి రావడంతో భారత్‌పై సుంకాలు విధించడంపై ఢిల్లీలోని అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య వాషింగ్టన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు భారత, అమెరికా దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: The Devil’s chair: ఏఐ టెక్నాలజీతో ది డెవిల్స్ చైర్

ట్రంప్ మొదటి పదవీకాలంలో 2020, ఫిబ్రవరిలో భారత్‌ను సందర్శించారు. అహ్మదాబాద్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ వాగ్దానం చేశారు. ఇక అంతకముందు 2019లో హ్యూస్టన్‌లో మోడీతో కలిసి ట్రంప్.. హౌడీ మోడీ ర్యాలీ నిర్వహించారు. భారతీయ అమెరికన్లు భారీగా పాల్గొన్నారు.

ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమై మోడీ-ట్రంప్ సమావేశంపై చర్చించారు.

ఇది కూడా చదవండి: RG Kar rape case: సంజయ్ రాయ్ శిక్షపై హైకోర్టులో సీబీఐ సవాల్.. ఏం కోరిందంటే..!