PM Modi: లోక్‌సభ ఏడు విడతల్లో భాగంగా ఈ రోజు మూడో విడత ఎన్నికలు పూర్తయయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా..‘‘ విపక్ష కూటమి తిరోగమన ఆర్థిక వ్యవస్థ, కాలం చెల్లి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మరింత ఆవిరైపోతోంది’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
Read Also: Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..
ఈ రోజు వేసిన అందరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో అన్ని వర్గాల ఓటర్లు ఎన్డీయేపై, మా అభివృద్ధిపై విశ్వాసం ఉంచారని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇండి అలియన్స్ వారి పాత ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మరింత ఆవిరైపోతోంది అని అన్నారు. మూడో దశలో 11 రాష్ట్రాలు/యూటీల్లోని 93 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. నాలుగో విడత ఈ నెల 13న జరగబోతోంది. ఈ దశలో తెలంగాణలో ఎంపీ స్థానాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు జూన్ 1తో ఏడు దశల్లో ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.