NTV Telugu Site icon

Maharashtra Polls: వింతైన చావు.. ఓటేస్తూ ప్రాణాలు వదిలిన స్వతంత్ర అభ్యర్థి

Heartattackpollingbooth

Heartattackpollingbooth

చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే ఉన్నట్టుండి మాయమైపోతున్నారు. ఇటీవల కర్ణాటకలో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్‌లోకి ఈత కొట్టడానికి దిగి.. ఊపిరాడక కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్రలో కూడా అందరూ చూస్తుండగానే కళ్ల ముందే ఒక స్వతంత్ర అభ్యర్థి ఊపిరి వదిలాడు. ఈ ఘటన బీడ్‌ నియోజకవర్గంలో జరిగింది.

ఇది కూడా చదవండి: Pushpa 2: కిస్సిక్ కస్సక్ అనిపించేది ఆరోజే!!

బుధవారం మహారాష్ట్రలో అసెంబ్లీ పోలింగ్ జరిగింది. ఉదయం నుంచి అందరూ ఉత్సాహం పోలింగ్‌లో పాల్గొన్నారు. భారీ ఎత్తున పోలింగ్ కూడా నమోదైంది. అయితే బీడ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఛత్రపతి షాహూ ఓటు వేసేందుకు విద్యాలయ ఓటింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటు వేస్తుండగా ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో ఛత్రపతి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్రం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకం.. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం..

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల సమయంలో అభ్యర్థి మరణిస్తే సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటుపై ఓటింగ్‌ను వాయిదా వేయవచ్చు. తాజాగా అభ్యర్థి మరణించడంతో ఈ నియోజకవర్గంలో మళ్లీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. బీడ్ అసెంబ్లీ స్థానం ఒకప్పుడు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి కంచుకోట. పార్టీ విభజన తర్వాత అజిత్ పవార్ ఎన్‌సీపీ ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహాయుతి పొత్తులో భాగంగా అజిత్ పవార్ పార్టీకి సీటు దక్కింది.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం ఎన్డీఏ కూటమినే గెలవబోతుందని అంచనాలు చెబుతున్నాయి. శనివారం వెలువడే ఫలితాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Gautam Adani: గౌతమ్ అదానీపై అభియోగాలు.. ప్రతిపక్షాల మెడకే చుట్టుకుంటోంది..