బడ్జెట్ అంటే సామాన్య, మధ్యతరగతి వారు ఎంతో ఆశతో ఎదురుచూస్తారు. కానీ అవేం నెరవేరలేదు తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఏదో మాయ చేస్తారని భావించారు. కానీ అవేం ఒట్టి మాటలే అని నిరూపణ అయింది. ట్యాక్స్ రిటర్న్ అప్‌డేట్ చేసుకునే వారికి మాత్రం గుడ్ న్యూస్ అందించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ట్యాక్స్ రిటర్న్ చేసుకునేవారికి రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు.
ఐటీ రిటర్న్‌లో లోపాలను సవరించుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు ఇది మంచి అవకాశమని మంత్రి అన్నారు. పన్నులు చెల్లింపులు మరింత సులభం చేసేందుకు ప్రభుత్వం ఈ ఫైలింగ్‌ను అమల్లోకి తేగా..టెక్నికల్ గ్లిచెస్‌తో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేసేవారు స్టాండర్డ్ డిడక‌్షన్‌లో పలు సవరణలు చేస్తారని భావించారు. కానీ, ఈ బడ్జెట్‌లో దానికి సంబంధించిన అంశం ప్రస్తావనకు రాకపోవడంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. మరోవైపు ఇన్‌ట్యాక్స్ శ్లాబుల్లో కూడా మార్పులు తేవాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే కేంద్ర బడ్జెట్‌లో వీటికి ఏమాత్రం అవకాశం కల్పించలేదు. పన్నులకు సంబంధించిన అనుబంధ సెక‌్షన్లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయకపోవడంతో ఈ బడ్జెట్ పై సామాన్య , మధ్యతరగతి వారు పెదవి విరుస్తున్నారు. నేషనల్ పెన్షన్ స్కీంలో డిడక‌్షన్ 14 శాతం పెంచుకునే వెసులుబాటు మాత్రం కల్పించారు.