IT Raids: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో అధికారులకు షాక్ తగిగిలింది. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఆ ఇంట్లో మూడు మొసళ్లను కూడా వారు గుర్తించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేశ్ కేశర్వాని ఇళ్లలో గత ఆదివారం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు చేస్తున్నారు. సుమారు రూ. 155 కోట్ల పన్ను ఎగవేసినట్లు సమాచారం. ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటి నుంచి మూడు కోట్ల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు ఐటీ అధకారులు.
Read Also: Great Republic Day Sale 2025: అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ సేల్.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే!
కాగా, రాథోడ్, కేశర్వాని .. ఇద్దరూ బీడీ వ్యాపారం చేసేవారు. అయితే, కేశర్వాని సుమారు రూ. 140 కోట్ల పన్ను ఎగవేసినట్లు తేలగా.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను తనిఖీల చేస్తున్న సమయంలో.. అతను నిర్మాణ రంగంలో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంట్లో సోదాలు చేయగా మూడు మొసళ్లు ఉన్నట్లు గుర్తించారు. నివాసంలోని ఓ చిన్న కుంటలో అవి ఉండటంతో అటవీ శాఖను ఆదాయపు పన్నుశాఖ అధికారులు అలర్ట్ చేశారు.
Read Also: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
అయితే, కేశర్వాని ఇంట్లోనూ పలు బినామీ పేరుతో దిగుమి చేసుకున్న కార్లను ఐటీ అధికారులు గుర్తించారు. అందులో ఒక్క కారు కూడా అతడి కుటుంబం పేరిట లేదని తేలింది. ట్రాన్స్‌పోర్టు శాఖ నుంచి కార్లకు చెందిన సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఆ కార్లను ఎలా కొనుగోలు చేశారన్న దానిపై విచారణ చేస్తున్నారు. సాగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ తొలుత బిజినెస్ చేసేవాడు.. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడిగా విజయం సాధించాడు. జిల్లా అధ్యక్షుడి పోస్టు కోసం కూడా తీవ్రంగా పోటీ చేశారు. ఆయన తండ్రి హర్నమ్ సింగ్ రాథోడ్ సైతం గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వహించారు.