NTV Telugu Site icon

Asaduddin Owaisi: ఎన్నికల తర్వాత దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయి..

Owaisi

Owaisi

Asaduddin Owaisi: ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు పెరిగాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన సంఘ్ పరివార్‌ని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు మౌలానాలు హత్యకు గురయ్యారని, అక్బర్ నగర్‌లో ముస్లిం ఇళ్లను బుల్డోజ్ చేశారని, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు ముస్లింలను కొట్టారని ఆయన ట్వీట్ చేశారు. సంఘ్ పరివార్ ముస్లింలపై ప్రతీకారం తీర్చుకుంటుందా..? అని ఎంఐఎం అధినేత ప్రశ్నించారు.

Read Also: Telangana Crime: ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. డ్రామా ఆడి దొరికిపోయాడు..

జూన్ 4న ఫలితాలు ప్రకటించిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 24 మంది ముస్లిం అభ్యర్థులు గెలుపొందారు. 2014లో 23 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచిన దాని కన్నా ఎక్కువ, చివరి పార్లమెంట్‌తో పోలిస్తే(26)తక్కువ. అయితే, ఈ సారి మోడీ కేబినెట్‌లో ఒక్కరూ కూడా ముస్లిం మంత్రి లేరనే విమర్శలు కూడా వెళ్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది 78 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గెలిచిన ప్రముఖుల్లో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఉన్నారు. ఈయన పశ్చిమ బెంగాల్ బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అస్సాం ధుబ్రీ నుంచి కాంగ్రెస్ నేత రకీబుల్ హుస్సేన్ ఉన్నారు.