Site icon NTV Telugu

Karnataka: మైనర్‌ను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడి.. సోషల్ మీడియాలో వీడియో

Madhya Pradesh Rape

Madhya Pradesh Rape

మైనర్‌ బాలికను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. వీడియో కూడా తీశాడు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో జరిగింది. ఆగస్టు 8న ఓ లాడ్జికి తీసుకెళ్లి మైనర్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు లైంగిక దాడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో పెట్టగా, చాలా మంది ఇతర గ్రూపుల్లో షేర్ చేశారు.

Read Also: Anna Canteens: రేపే ఏపీ వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం..

కాగా.. ఆ యువకుడిని ధార్వాడ్ విద్యాగిరి పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. గ్రూపుల్లో వీడియో షేర్ చేసిన 9 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా.. మైనర్ బాలికపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అలాంటి అత్యాచారాలకు పాల్పడే మృగాళ్ల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

Read Also: Team India: టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్.. ఆయన ఎవరంటే..?

Exit mobile version