NTV Telugu Site icon

Karnataka: డబ్బాలో డబ్బు.. తీసి చూస్తే ఉప్పు.. ఏం ఐడియా సర్ జీ

Untitled 1

Untitled 1

Karnataka: మాటలతో మయా చేస్తూ ప్రజలను మభ్యపెట్టి దొరికినకాడికి దోచుకుంటున్నారు కేటుగాళ్లు.. తెలిసిన వాళ్ళనైనా, సొంత బంధువులనైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అని నమ్మబలికి కేటుగాళ్లు ప్రజలను మోసం చేసిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. డబ్బాలో ఉప్పు పెట్టి డబ్బులు ఉన్నాయని మోసం చేస్తూ పడ్డుబడ్డాడు ఓ వ్యక్తి.. వివరాలలోకి వెళ్తే.. తిప్పూరు నగరానికి చెందిన బాబా అనే వ్యక్తికి ప్రముఖులతో, రాజకీయ నాయకులతో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. దీనితో ఆయనకు ఉన్న పలుకుబడిని ప్రజలను మోసం చేయడానికి వినియోగించారు. తక్కువ వడ్డీకి డబ్బులు ఇపిస్తానని చెప్పి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఇతను అప్పు తీసుకునే వ్యక్తికి అప్పు ఇచ్చేవ్యక్తికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేవాడు.

Read also:Vizag Steel Plant: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ.. ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు

కాగా అప్పు కావాల్సిన వ్యక్తికి డబ్బులు అందిస్తాను అని చెప్పి ఫైనాషియర్ దగ్గర డబ్బులు తీసుకునే వాడు.అనంతరం ఓ డబ్బాని ఉప్పు కాగితాలతో నింపి పైన కొన్ని కరెన్సీ నోట్లు పెట్టి అప్పు తీసుకునే వ్యక్తులని మోసం చేసాడు. తాజాగా గిరీష్ అనే వ్యక్తికి తక్కువ వడ్డీకి రూ/ కోటి రుణం ఇప్పిస్తానని చెప్పాడు. అలానే రూ/2.5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అలానే రాజేష్ జాతవ్‌ అనే అతనికి కూడా ఇలానే చెప్పి రూ/ 30 వేలు అడ్వాన్స్ ఇచ్చారు . కాగా మిగిలిన డబులు శివమొగ్గ రైల్వే స్టేషన్‌ దగ్గర ఇస్తాను అని చెప్పారు. ఈ నేపథ్యంలో గిరీష్, రాజేష్ జాతవ్‌ శివమొగ్గ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాగా వాళ్లకు బాబా ఉప్పు, కాగితం, డబ్బుతో నింపిన రెండు పెట్టెలు తెచ్చి ఇద్దరికి ఇచ్చి ఒక్కో బాక్స్ లో కోటి రూపాయలు ఉన్నాయని చెప్పారు.

Read also:South Central Railway: ట్రైన్లలో టపాసులు తీసుకెళ్తే జైలు శిక్ష.. సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరిక

గిరీష్, రాజేష్ అక్కడే బాక్స్ ఓపెన్ చేసి చూడగా పైన కరెన్సీ నోట్లు ఉన్నాయి. దానితో వాళ్లకు ఎలాంటి అనుమానం రాలేదు. అయితే తరువాత మొత్తం తీసి చూడగా ఇద్దరు కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు బాబాను ఆ బాక్స్ లు రైల్వే స్టేషన్ కి తెచ్చిన బాబా డ్రైవర్ జబీవుల్లాను అరెస్ట్ చేశారు.