NTV Telugu Site icon

Uddhav Thackeray: కాంగ్రెస్, శరద్ పవార్‌పై విమర్శలు.. ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ ప్రశంసలు..

Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న మహారాష్ట్రలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. మొత్తం 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలం 09 స్థానాలు, దాని మిత్రపక్షాలైన శివసేన(షిండే) 07, ఎన్సీపీ(అజిత్ పవార్) 01 స్థానాలను మాత్రమే సాధించాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఇండియా కూటమి ఏకంగా ఏకంగా 30 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ 13, ఎన్సీపీ(శరద్ పవార్) 08, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 09 స్థానాల్లో గెలిచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై ఇండియా కూటమి పైచేయి సాధించింది.

Read Also: Viral Video: రీల్స్కు అడ్డాగా మారిన ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువతుల డ్యాన్స్ వైరల్

ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాక్రే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, మిత్రపక్షాలైన కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీలే ఎక్కువగా లాభపడ్డాయని, శివసేన అనుకున్న సీట్లను సాధించలేదని బీజేపీ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ మంగళవారం అన్నారు. ఠాక్రే ఆరోగ్యం బాగా లేకుండాన్న గట్టిగా ప్రచారం చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఠాక్రే పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తే 09 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి 13 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేసి 08 స్థానాల్లో గెలిచింది.

మరోవైపు ఉద్దవ్ ఠాక్రే బీజేపీతో మళ్లీ స్నేహం చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఇలా ప్రశంసలు రావడం చర్చనీయాంశంగా మారింది. శివసేన విడిపోకముందు 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి దాదాపుగా మహారాష్ట్రలోని సీట్లను క్లీన్‌స్వీప్ చేశాయి. అయితే, ఈసారి మాత్రం భారీ ఎదురుదెబ్బ తాకింది. 2019, 2014 ఎన్నికల్లో స్వయంగా మెజారిటీ మార్కు(272) కన్నా ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ, 2024 ఎన్నికల్లో 240 సీట్లలో మాత్రమే గెలిచింది. అయితే, మొత్తంగా ఎన్డీయే కూటమి 293 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి అధికారి చేపట్టింది.

Show comments