NTV Telugu Site icon

PM Modi: గ్రామాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమలు ముఖ్యం

Pm Modi

Pm Modi

PM Modi: దేశంలోని గ్రామాల్లో గ్రామపంచాయతీరాజ్‌ వ్యవస్థను తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హర్యానాలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రాంతీయ పంచాయతీరాజ్ కౌన్సిల్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో జరిగిన కార్యక్రమంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు ఓపీ ధన్‌ఖడ్‌ తదితరులతో కలిసి మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనం చేసిందని ప్రధాని విమర్శించారు.

Read also: Kushi : ట్రైలర్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా గ్రామాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేయడం ఎంత అవసరమో కాంగ్రెస్‌కు అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత ఏర్పాటైన జిల్లా పంచాయతీ వ్యవస్థను కాంగ్రెస్‌ హయాంలో వాటి భవితవ్యానికి వదిలేసిందని ప్రధాని మోదీ అన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్ము లోయలో మొట్టమొదటిసారిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనంతరం గ్రౌండ్ లెవెల్లో ప్రజాస్వామ్యం స్థాపించబడిందని ప్రధాని తెలిపారు. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత, మొదటిసారిగా గ్రామ పంచాయతీ నుండి జిల్లా స్థాయికి ఎన్నికలు జరిగాయన్నారు. వాటి ద్వారా 33 వేల మందికి పైగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని మోడీ బీజేపీ నేతలకు గుర్తు చేశారు. లోయలో తొలిసారిగా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం ఏర్పడిందని మోడీ తెలిపారు. గ్రామాల్లో కొంత సమయం గడపడం ద్వారా చిన్న ప్రాంతాలతో తమను తాము పరిచయం చేసుకోవాలని ప్రధాని మోడీ బిజెపి కార్యకర్తలను కోరారు. గత 25 ఏళ్ల అనుభవాన్ని కార్యకర్తలను గుర్తు చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రతినిధిగా, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రయోజనాలను సమాజంలోని చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వారానికి 2 రాత్రులు మీ ప్రాంతంలోని ఏదైనా గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలతో కూర్చోవాలని ప్రధాని మోడీ కార్యకర్తలకు సూచించారు.

Show comments