Site icon NTV Telugu

IMD Warning: ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. చలిగాలులు.. ఐఎండీ వార్నింగ్

Imdwarning

Imdwarning

దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలకు ప్రజలు సిద్ధపడుతున్నారు. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, చలిగాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.

అనేక రాష్ట్రాలకు భారీ వర్షాలు, చలిగాలులు ఉంటాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్‌, అస్సాం, మేఘాలయ మరియు ఉత్తరాఖండ్‌లో చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

అయితే సంక్రాంతి సంబరాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇలాంటి తరుణంలో వర్షాలు కురిస్తే పండగ సందడికి ఆటంకం కలుగుతుంది. అంతేకాకుండా ప్రయాణాలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Exit mobile version