IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- ఎండల నడుమ భారత వాతారణ శాఖ చల్లని కబురు
- వేగం పుంజుకున్న రుతుపవనాలు
- ఈశాన్య భారతదేశంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు ఎల్ నినో భయాలు, మరోవైపు దంచికొడుతున్న ఎండల నడుమ భారత వాతారణ శాఖ చల్లని కబురును అందించింది. రుతుపవనాలు వేగం పుంజుకుని ముందుకు సాగుతున్నాయని తెలిపింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తుఫాను, వర్షాల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. వీటిలో జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ, గోవా, తెలంగాణ ఉన్నాయి. ఈరోజు కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మే 25వ తేదీన ఢిల్లీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Also Read
- West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి, ధర్మశాలలో మే 29 వరకు ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, నైనిటాల్, హరిద్వార్‌లలో వాతావరణం మారుతోంది. మే 25వ తేదీన బలమైన గాలులతో పాటు వర్షం, వడగళ్ళు పడే అవకాశం ఉంది.
మే 24, 25 తేదీలలో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, పహల్గామ్లలో ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
జార్ఖండ్‌లోని రాంచీ, జంషెడ్పూర్, ధన్‌బాద్‌లలో ఈరోజు, రేపు (మే 24-25) తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తదనంతరం, మే 26, 29 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
-
Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్‌పై చరణ్ క్రేజీ కామెంట్స్
-
US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?