IIT Bombay: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ‘‘రామాయణాన్ని’’ కొందరు విద్యార్థులు అవమానకరంగా మార్చారు. ఐఐటీ బాంబేకి చెందిన విద్యార్థులు ఆర్ట్ ఫెస్టివల్‌లో భాగంగా ‘‘రాహోవన్’’ అనే నాటకాన్ని ప్రదర్శించడం వివాదాస్పదమైంది. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’పై ఆధారపడిన ఈ నాటకంలో శ్రీరాముడిని కించపరిచేలా, హిందూ సంస్కృతిని అగౌరవపరిచేలా స్కిట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Read Also: Hajj Pilgrims: నిప్పుల కొలిమిలా “హజ్ యాత్ర”.. 68 మంది భారతీయులతో పాటు 1000కి పైగా మృతి..
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఐఐటీ బాంబే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.1.2 లక్షల జరిమానా విధించింది. సెమిస్టర్ ఫీజుకు దాదాపుగా సమానమైన జరిమానాతో పాటు గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు జింఖానా అవార్డుల్లో ఎలాంటి గుర్తింపు పొందరని, దీంతో పాటు వీరి జూనియర్స్ ఒక్కొక్కరు రూ.40,000 జరిమానా విధించడంతో పాటు హస్టల్స్ నుంచి నిషేధించబడ్డారు.
మార్చి 31న ఈ నాటకాన్ని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించారు. ఈ నాటకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీత, లక్ష్మణుడికి మధ్య జరిగిన సంభాషణలు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి.ఈ నాటకం ప్రధాన పాత్రల్ని చెడుగా చూపించాయని ఫిర్యాదులు అందాయి. ఈ నాటకం హిందూ సంస్కృతిని, మతపరమైన భావాలను అపహాస్యం చేసేలా ఉందని కూడా ఆరోపించారు. దీని తర్వాత విద్యాసంస్థ ఒక క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసింది. నాటకంలో పాల్గొన్న విద్యార్థులతో సమావేశం నిర్వహించింది. చాలా చర్చల తర్వాత కమిటీ జరిమానాతో పాటు ఇతర క్రమశిక్షణా చర్యల్ని తీసుకుంది.