NTV Telugu Site icon

Farming: ఎకరం పొలంలో నెలకు రూ.2 లక్షలు సంపాదన.. ఆ పంటతో సిరుల పంట!

Pumpkin

Pumpkin

Farming: తన ఎకరం పొలంలో నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు ఓ రైతు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా వ్యవసాయానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ మామిడి, లిచ్చి, అరటితో పాటు కూరగాయలను రైతులు పెద్దఎత్తున సాగు చేస్తారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటలను రాజధాని పాట్నాకు సరఫరా చేస్తారు. అయితే కూరగాయల సాగుతో కొందరు రైతులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా మారింది.

Read Also: Vyooham: వర్మ ‘వ్యూహం’లో చిరు, పవన్.. ‘అల్లు’ వారిని కూడా వదలలేదుగా!

కూరగాయల సాగు చేస్తూ ప్రజల ముందు ఆదర్శంగా నిలిచాడు ఓ రైతు. సమస్తిపూర్‌లోని మధురాపూర్ తారా గ్రామానికి చెందిన రైతు దీనదయాళ్ రాయ్.. కూరగాయల సాగుతో నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే ఏ పంటను సాగుచేస్తున్నాడంటే.. ఒకటిన్నర ఎకరాల్లో గుమ్మడి వేశాడు. దీనితో సంప్రదాయ పంటలతో పోలిస్తే కొంత ఎక్కువనే లాభం పొందుతున్నట్లు తెలిపాడు. ఇతని పొలాల్లో పండే కూరగాయలకు గిరాకీ ఉండడంతో ఇతర జిల్లాల నుంచి కూడా గుమ్మడికాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వస్తుంటారు.

Read Also: Price Hike: టమోటాలతో పాటు వాటి ధరలు కూడా పెరిగాయి.. ఎంత పెరిగాయో తెలుసా..!

అయితే సేంద్రియ పద్ధతిలో గుమ్మడికాయ సాగు చేస్తున్నట్లు రైతు దీనదయాళ్ రాయ్ తెలిపాడు. తమ పొలాల్లో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడనన్నాడు. దీంతో వారి కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ నుండి వ్యాపారులు కూడా గుమ్మడికాయ కొనుగోలు కోసం మధురాపూర్ తారా గ్రామాన్ని వచ్చి తీసుకెళ్తున్నారు. సేంద్రియ పద్ధతిలో తయారుచేసిన తాజా కూరగాయలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

Read Also: PM Modi: రేపు 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని

పంట సాగు కోసం రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడడం లేదని రైతు అంటున్నాడు. అతనికి చాలా ఆవులు ఉన్నాయని.. వాటి పేడను పొలంలో ఎరువుగా వేస్తున్నట్లు తెలిపాడు. దానివల్లే మంచి దిగుబడి పొందుతున్నట్లు దీనదయాళ్ తెలిపాడు. సుమారు ఒకటిన్నర ఎకరాల్లో గుమ్మడికాయ సాగుచేశామని.. వారానికి 1500 నుంచి 1600 గుమ్మడికాయలు సాగు వస్తేుందని తెలిపాడు. ఒక్కో గుమ్మడికాయను రూ.30-40కి విక్రయిస్తున్నారు. ఈ విధంగా నెలలో దాదాపు 6400 గుమ్మడికాయలను విక్రయించి రూ.2 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు.