NTV Telugu Site icon

China Virus: బెంగళూరులోనే రెండు కేసులు.. HMPV వైరస్గా నిర్ధారణ

Icmr

Icmr

China Virus: చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) కేసులు భారత్‌లో రెండు నమోదయ్యాయి. బెంగళూరుకు చెందిన ఓ ఆస్పత్రిలో మూడు, ఎనిమిది నెలల చిన్నారుల్లో ఈ వైరస్‌ ఉన్నట్లు గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దృవీకరించింది. అయితే, వీరిలో ఒక చిన్నారికి వైరస్‌ తగ్గుముఖం పట్టగా.. మరొకరికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. భారత్‌లో చైనా వైరస్‌ వ్యాప్తిపై పూర్తి స్థాయిలో ఆరా తీసుకున్నారు.

Read Also: Dil Raju : తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్స్ పై దిల్ రాజు ప్రెస్ మీట్

అయితే, హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన ఇద్దరు చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హస్టరీ లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. అయినప్పటికీ వ్యాది రావడం అందరినీ కలవర పెడుతుందని తెలిపింది. కాగా, చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్‌ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తుండటంతో భారత్ ఇప్పటికే అలర్ట్ అయింది. ఇటీవలే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ మీటింగ్ నిర్వహించింది.

Read Also: Charlapally Terminal: కాసేపట్లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం.. పాల్గొన్న ముఖ్య నేతలు

శీతాకాలంలో మార్పులు చోటుచేసుకున్న కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ తేల్చింది. భారత్‌లోని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డీజీహెచ్ఎస్ చెప్పుకొచ్చింది.