Site icon NTV Telugu

IAS Officer Wife: గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన ఐఏఎస్‌ అధికారి పెళ్ళాం.. చివరికి ఏమైందంటే..?

Ias

Ias

IAS Officer Wife: గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రణ్‌జీత్‌ కుమార్‌ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సూర్య జై తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఆమె ఇంటి నుంచి పారిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11వ తేదీన తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు ట్రై చేశారు. మదురై పోలీసులు తక్షణమే రియాక్ట్ అయి.. బాలుడిని సేవ్ చేశారు. అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్‌, సూర్య జై కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Read Also: Gold Price Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వారం రోజుల్లో ఐదోసారి!

ఇక, ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్‌లోని తన భర్త రణ్‌జీత్‌కుమార్‌ ఇంటికి వెళ్లింది. కానీ ఐఏఎస్‌ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. మనస్తపానికి గురైన ఆమె విషం తాగిన సూర్య జై 108కు కాల్ చేసింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రణ్‌జీత్‌ తరఫు న్యాయవాది రియాక్ట్ అవుతూ.. ఐఏఎస్‌ దంపతులిద్దరూ గతేడాది నుంచి దూరంగా ఉన్నారు.. రణ్‌జీత్‌ విడాకుల కోసం దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు.. గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెను లోనికి రానివొద్దని పనివాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసుపై బయటకు వెళ్లాగా.. తిరిగి వచ్చేసరికి ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు. కాగా, ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఐఏఎస్‌ అధికారి రణ్‌జీత్‌ కుమార్‌ నిరాకరించినట్లు తెలుస్తుంది.

Exit mobile version