Nagpur: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక కేసు సంచలనంగా మారింది. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి భార్యను ఆమె క్లాస్‌మేట్ వేధిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియో తనను ‘‘వదిలేయాలి’’ అని మహిళ ఎంత చెప్పినా వినిపించుకోకుండా బలవంతం చేస్తున్నట్లుగా ఉంది. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని, అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని, బలవంతంగా మతమార్పిడికి ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.
వీడియోలో బాధిత మహిళ తనను వదిలేయాలని వేడుకుంటుండగా, నిందితుడు అయాజ్ తాజ్ మదారే ఆమె చేతులు పట్టుకుని ఇస్లాం ప్రార్థనలు చదువుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటన తర్వాత తనను మతం మార్చినట్లు ప్రకటించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఈ వ్యవహారాన్ని తన భర్తకు చెప్పిన తర్వాత, జూన్ 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, 2025 ఫిబ్రవరిలో బాధితురాలిని, ఆమె మాజీ క్లాస్‌మేట్ అయాజ్ తాజ్ మదారే భూమి కొనుగోలు పేరుతో వార్ధా రోడ్డులోని ఒక హోటల్‌కు పిలిచాడు. అక్కడే ఆమెకు మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చిన, స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసి, వీడియోలు, ఫోటోలు తీశాడని తెలుస్తోంది. ఈ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ మహిళను పలుమార్లు లైంగికంగా వేధించారు. బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ0. 3.09 లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు.
ఈ కేసులో, తనను నాగ్‌పూర్ సమీపంలోని కల్మేశ్వర్‌కు తీసుకెళ్లి అమీన్ షేక్, హజ్రత్ మౌలానా అనే ఇద్దరు వ్యక్తులకు పరిచయం చేశారని, అక్కడే కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి మతం మార్చినట్లు వారు చెప్పారని బాధితురాలు వెల్లడించింది. ఇదే కాకుండా అయాజ్ మదారేతో వివాహం జరిగినట్లు చెప్పారని, దీని తర్వాత మళ్లీ అత్యాచార యత్నం జరిగినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ కేసులో పోలీసులు అయాజ్ తాజ్ మదారే, అమీన్ షేక్‌లను అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు హజ్రత్ మౌలానా కోసం గాలింపు చేపట్టారు.
Nagpur: A married woman from Sonegaon has filed a serious complaint alleging sexual exploitation, blackmail, and pressure for religious conversion by three men, leading to the registration of a case at Sonegaon Police Station.According to the complaint, the woman’s former… pic.twitter.com/CpUZtdVKY7
— NextMinute News (@nextminutenews7) June 16, 2026

