Site icon NTV Telugu

Ukraine Effect: ఐఏఎఫ్ కీల‌క నిర్ణ‌యం… కోబ్రా వారియ‌ర్ 22 నుంచి వెన‌క్కి…

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. మార్చి 6 నుంచి 27 వ తేదీ వ‌ర‌కు యూకేలోని వ‌డ్డింగ్ట‌న్‌లో కోబ్రా వారియ‌ర్ 2022 జ‌రుగనున్న‌ది. ఈ కోబ్రా వారియ‌ర్ కార్య‌క్ర‌మంలో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తేజాస్ లైట్ వెయిటెడ్ యుద్ద విమానాలు పాల్గొనాల్సి ఉన్న‌ది. ప్ర‌స్తుతం ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం కార‌ణంగా ఈ కోబ్రాస్ వారియ‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో యుద్ధ విమానాల ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన‌డం వ‌ల‌న యుద్ధ సంక్షోభం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. తాము ఏ దేశానికి కొమ్ముకాయ‌డం లేద‌ని, త‌ట‌స్థంగా ఉంటున్నామ‌ని, భార‌త్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంద‌ని, అందుకే కోబ్రా వారియ‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం లేద‌ని ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ స్ప‌ష్టం చేసింది.

Read: Viral: బాంబుల మోత మ‌ధ్య‌లో ఉక్రెయిన్ జంట వివాహం…

Exit mobile version