Assam: అస్సాంలో విషాదం.. సుఖోయ్ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
- భారత వాయుసేనలో ఘోర విషాదం
- సుఖోయ్ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తీవ్ర దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వాయుసేనలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అస్సాంలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.

Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
భారత వాయుసేన విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్‌లు చనిపోయినట్లుగా భారత వైమానిక దళం శుక్రవారం తెలిపింది. యుద్ధ విమానం శిక్షణ మిషన్‌లో భాగంగా గురువారం రాత్రి టేకాప్ అయిందని.. అయితే రాత్రి 7:42 గంటల సమయంలో రాడార్‌తో సంబంధం కోల్పోయిందని.. అనంతరం కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో కూలిపోయిందని తెలిపింది. ప్రమాద స్థలం జోర్హాట్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు భారీ శబ్దం.. పేలుడు విన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రక్షణ బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. ఈ యుద్ధ విమానం రష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ రూపొందించింది. ఈ విమానాలను భారతదేశంలో హెచ్ఏఎల్ తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద 200కు పైగా Su-30MKI యుద్ధవిమానాలు ఉన్నాయి.
IAF acknowledges the loss of Sqn Ldr Anuj and Flt Lt Purvesh Duragkar, who sustained fatal injuries in the Su-30 crash. All personnel of the IAF express sincere condolences and stand firmly with the bereaved family in this time of grief: Indian Air Force pic.twitter.com/PODgDwPprS
— ANI (@ANI) March 6, 2026
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!