Site icon NTV Telugu

Kamal Haasan: ‘‘తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా’’.. కన్నడ వివాదంపై కమల్ హాసన్..

Kamal Haasan

Kamal Haasan

Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ ఇటీవల తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించడంపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకుంది. కమల్ హాసన్ సినిమాను రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి.

Read Also: Rajnath Singh: ‘‘అలా జరిగితే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయేది’’..

అయితే, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి కమల్ హాసన్ నిరాకరించారు. తన వ్యాఖ్యలు తప్పు అని భావిస్తేనే క్షమాపణలు చెప్పేవాడిని సమర్థించుకున్నారు. ‘‘నాకు గతంలో బెదిరింపులు వచ్చాయి. కానీ ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, కేరళ పట్ల నాకు ఉన్న ప్రేమ నిజం. ఒక ఎజెండా ఉన్నవారు మాత్రమే వేరే విధంగా అనుమానిస్తారు’’ అని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని, తాను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతానని చెప్పారు.

మరికొన్ని రోజుల్లో డీఎంకే మద్దతుతో రాజ్యసభలో అడుగుపెట్టనున్న కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలతో దుమారాన్ని రేపారు. భాషను అమితంగా ప్రేమించే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇది పెద్ద వివాదంగా మారింది. కన్నడ రక్షణ వేదిక అతడిపై కేసు నమోదు చేసింది. కర్ణాటకలో సినిమా బిజినెస్ కావాలి, అయినా కూడా కన్నడను అవమానిస్తారా..? అని కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. కన్నడ కన్నా తమిళం గొప్పదనే ప్రయత్నం చేస్తున్నాడని కమల్ హాసన్‌పై విరుచుకుపడుతున్నారు.

Exit mobile version