Site icon NTV Telugu

Nitish Kumar: “నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా”.. ఇండియా కూటమికి నితీష్ కుమార్ షాక్..

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: నితీష్ కుమార్ ఇండియా కూటమి ఆశలపై నీళ్లు చల్లారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న నితీష్ తమతో ఎప్పుడైనా కలవకపోతారా అని ఆశిస్తు్న్న కూటమి నేతలకు రుచించని పరిణామం ఎదురైంది. ఈ రోజు బీజేపీ నేతృత్వంలో జరిగిన ఎన్డీయే నేతలు, ఎంపీల సమావేశంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి పని చేయదు అంటూనే, తాను అన్ని వేళలా ప్రధానమంత్రి మోడీతోనే ఉంటాను అని అన్నారు. కూటమలు మార్చే పేరున్న నితీష్ కుమార్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో ఎంపీలంతా ఒక్కసారి తమ ఆనందాన్ని చప్పట్ల రూపంలో వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ మోడీకి మద్దతు ప్రకటించరని భావిస్తున్న ఇండియా కూటమికి ఆయన షాక్ ఇచ్చారు.

Read Also: PM Modi: కాంగ్రెస్ 10 ఏళ్లలో 100 మార్క్‌ని దాటలేకపోయింది..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 543 స్థానాల్లో 293 గెలుచుకుంది. మెజారిటీ మార్కు 272 సీట్లను దాటి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. ఇదిలా ఉంటే గతంలో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా మెజారిటీ మార్కును సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు దక్కాయి. అయితే, మిత్రపక్షాలైన తెలుగుదేశం 16, జేడీయూ 12 ఎంపీ సీట్లను గెలుచుకుంది. శివసేన 07, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 05 సీట్లను గెలుచుకుని మొత్తంగా ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషించాయి.

అయితే, స్వతహాగా బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో ఇండియా కూటమి నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్ తమ వెంట వస్తారని ఊహించారు. కొందరు ఇండియా కూటమ నేతలు వీరిద్దర్ని సంప్రదించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా ప్రధాని నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా, తాము ఎప్పుడూ ఎన్డీయేలోనే ఉంటామని స్పష్టం చేశారు.

Exit mobile version