CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ వార్తల్లో వ్యక్తిగా మారారు. మౌలిక సదుపాయాల పనుల్ని వేగవంతం చేయాలని కోరుతూ, నితీష్ చేతులు జోడించి వేడుకోవడం వైరల్‌గా మారింది. బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం తన సీటు నుంచి లేచి, ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ చేతులు జోడించి ఐఏఎస్ అధికారి వైపు వెళ్లారు. ఆ ఐఏఎస్ అధికారి రాష్ట్ర అదనపు హోం కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రత్యయ అమృత్.
రాజధాని పాట్నాలో కంగన్ ఘాట్ వరకు జేపీ గంగా మార్గ్ పొడగింపును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం పాట్నాలో పర్యటించారు. త్వరతగతిన గంగా మార్గాన్ని విస్తరించేందుకు అధికారులు వేగవంతంగా పనిచేయాలని కోరారు. నితీష్ కుమార్ హఠాత్తుగా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే నీ పాదాలను తాకుతానని వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారి ప్రత్యయ అమృత్‌కి నమస్కరించి పాదాలను తాకినట్లు సైగ చేశాడు. అవాక్కయిన ప్రత్యయ అమృత్ చేతులు ముడుచుకుని ఆపడానికి ప్రయత్నించాడు.
Read Also: Swati Maliwal Case: బిభవ్ కుమార్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
బీహార్‌లో వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు భారీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నితీష్ కుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బీపీ గంగా మార్గ్ పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరుతున్నారు. గతేడాది ఈ ప్రాజెక్టు రెండో దశను సీఎం ప్రారంభించారు. అక్టోబర్ 11,2013న జయ ప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా నితీష్ కుమార్ జేపీ గంగా మార్గానికి శంకుస్థాపన చేశారు.
ఇప్పటికే వరసగా వంతెనలు కూలిపోతున్న క్రమంలో ఎన్నికల లోపు భారీ ప్రాజెక్టులను పూర్తి చేసి, ఎన్నికలకు వెళ్లాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు. మూడు వారాల్లో బీహార్‌లోని 13 వంతెనలు కూలిపోయాయి. వరస ఘటనలతో ప్రభుత్వం 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలను సర్వే చేసి తక్షణ మరమ్మతులు చేయాలని నితీష్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు.