NTV Telugu Site icon

IT raids: తమిళనాడులో ఐటీ దాడులు.. జి స్క్వేర్‌ సంస్థలో తనిఖీలు

It Rides

It Rides

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. రియల్ స్టేట్ కంపెనీ జి స్క్వేర్‌కు చెందిన పలు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. జి స్క్వేర్ కంపెనీ గతంలో రాజకీయ వివాదాల్లో చిక్కుకుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కంపెనీ విపరీతంగా ఎదగడానికి అధికార డీఎంకే అగ్రనేతలు సహకరించారని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, గతంలో జీ స్క్వేర్‌తోపాటు దానితో ఆర్థిక సంబంధాలున్న కంపెనీలపై ఏక కాలంలో దాడులు చేసింది. అప్పట్లో లెక్కల్లోకి రాని రూ.433 కోట్ల ఆస్తులను గుర్తించింది.

Also Read: KTR: త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ

Show comments