భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తల మధ్య కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అనుమతిస్తే.. పాక్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఎల్లప్పుడూ భారత్‌కు శత్రువేనన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘‘పాకిస్థాన్ ఎల్లప్పుడూ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.’’ అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Kamala Harris: డ్యాన్స్‌తో అదరగొట్టిన కమలా హారిస్.. వీడియో వైరల్
ఇక పాక్ భూభాగంపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఆ దాడులకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీ మంత్రి మజీంద్ సింగ్ సిర్సా తీవ్రంగా మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు కావాలంటే పాకిస్థాన్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చని ఘాటుగా బదులిచ్చారు. దీంతో చరణ్‌జీత్ వెనక్కి తగ్గారు. తాను ఆధారాలు అడగలేదని తెలిపారు. పాక్‌కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా.. కాంగ్రెస్ దానికి మద్దతునిస్తుందని వెల్లడించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలు రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసేసింది.
ఇది కూడా చదవండి: Indonesia: మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష
