NTV Telugu Site icon

Omar Abdullah: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తా.. అంతమాత్రాన బీజేపీతో జతకట్టి కాదు

Omar

Omar

Omar Abdullah: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యం.. ఇలా చేయడం భారతీయ జనతా పార్టీతో కలిసినట్టు కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో​ ఎవరు ఉన్నా తాము ఇలాగే కలిసి ముందుకెళ్తామని సీఎం ఒమర్‌ అబ్దుల్లా కన్వాల్‌లో ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

Read Also: BRS Rythu Dharna: నేడు షాబాద్‌లో బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా.. అన్నదాతలకు మద్దతుగా రామన్న!

ఇక, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాను కలిశాను అని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. నేను కేంద్ర సర్కార్ తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను అన్నారు. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నట్లు కాదని చెప్పారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో సానుకూలంగా ఉంటున్నాను.. అంతమాత్రాన మేము బీజేపీకి సపోర్టు ఇచ్చినట్టు కాదని వెల్లడించారు. రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ అవసరం ఎంతో ముఖ్యం అన్నారు. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న ప్రధాన లక్ష్యాలు.. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే అని పేర్కొన్నారు. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని క్వశ్చన్ చేశారు. కేంద్రం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే తీవ్ర నష్టం జరుగుతుందని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.

Read Also: Maharashtra: మహారాష్ట్రలో పులులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్

అయితే, గత ఏడాది నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండుసార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్‌లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో, ఒమర్‌- బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లా తాజాగా చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.