Changur Baba: హిందూ అమ్మాయిలు, మహిళలే టార్గెట్గా దేశవ్యాప్తంగా మతమార్పిడి నెట్వర్క్ని స్థాపించిన ఛంగూర్ బాబా అరాచకాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మత మార్పిడుల కోసం పలు ఇస్లామిక్ దేశాల నుంచి వందల కోట్లు నిధులను సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేద, మధ్య, బలహీన వర్గాలకు చెందిన హిందువులను టార్గెట్ చేస్తూ, లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడి చేసేందుకు వందల కోట్ల నిధుల్ని సంపాదించినట్లు సమాచారం. వీటిపై ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అధికారులతో పాటు ఎన్ఐఏ, ఐబీ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: Telangana : సీఎంల భేటీ.. తెలంగాణ 10 ప్రతిపాదనలు ఇవే..
అయితే, ఇవాళ లక్నోలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడినా సామూహిక మత మార్పిడికి పాల్పడిన సూత్రధారి జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా.. నేను నిర్దోషిని, నాకు ఏమీ తెలియదన్నారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఛంగూర్ బాబా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలను బలోపేతం చేయడానికి ఖాట్మండుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మత మార్పిడులతో పాటు దేశవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు ఇస్లాం మతంలోకి మారిన హిందూ మహిళలను నేపాల్లోని ఐఎస్ఐ ఏజెంట్లు, స్లీపర్ సెల్ ఆపరేటివ్స్లతో వివాహం చేయాలని ఛంగూర్ బాబా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాలతో సహా అనేక భారతీయ రాష్ట్రాలలో మత మార్పిడి నెట్వర్క్ వ్యాపించిందన్నారు.
#WATCH | Lucknow, Uttar Pradesh: Jamaluddin alias Chhangur, the alleged mastermind in the conversion case, and his aide Nasreen are being taken from the Community Health Centre after medical examination.
Jamaluddin alias Chhangur says, "I am innocent. I don't know anything." pic.twitter.com/HYEfu0hzhd
— ANI (@ANI) July 16, 2025