హనీమూన్ మర్డర్ కేసు తర్వాత మగాళ్లలో భయం మొదలైంది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి సోనమ్ రఘువంశీ అనే నవవధువు చంపేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఆమెను ఆదర్శంగా తీసుకున్నారో.. ఏమో తెలియదు గానీ.. చాలా మంది ఇల్లాల్లు.. ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్నవాళ్లనే కాటికి పంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడొక చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా హనీమూన్ మర్డర్ కేసు భయంతో ఒక భర్త.. ప్రియుడితోనే సుఖం జీవించాలని రాతపూర్వకంగా భార్యకు పర్మిషన్ ఇచ్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: PM Modi: నేటి నుంచి 2 దేశాల్లో పర్యటించనున్న మోడీ
రామ్‌చరణ్(47), జానకీదేవి(40) భార్యాభర్తలు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కేరి జిల్లా పర్సాముర్తా గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక రామ్‌చరణ్ ముంబైలో టైల్స్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జానకీదేవి గ్రామంలోనే పిల్లలతో ఉంటోంది. భర్తేమో ముంబైలో.. జానకీదేవి గ్రామంలో ఉంటుంది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం సోను ప్రజాపతి(24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కుటుంబానికి వేరుగా జానకీదేవి, సోను ప్రజాపతి ఏడు నెలలుగా వేరే ఇంట్లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న రామ్‌చరణ్.. భార్యను నిలదీయగా క్షమాపణ చెప్పి భర్త దగ్గరకు వచ్చేసింది. అంతా సర్దుకునేలోపే తిరిగి జానకి.. ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. కొన్ని నెలల నుంచి భర్త, పిల్లలకు దూరంగా ప్రియుడితోనే జీవిస్తోంది.
ఇది కూడా చదవండి: HHVM : ఆ మూవీ నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది : పవన్
దీంతో తన భార్య జానకి కనిపించడం లేదంటూ పోలీసులకు రామ్‌చరణ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే రామ్‌చరణ్ మనసు మార్చుకున్నాడు. తన భార్య చేతిలో చచ్చేకంటే.. ప్రశాంతంగా జీవించడం బెటర్ అనుకున్నాడు. దీంతో ఈనెల 20న కేసును వెనక్కి తీసుకున్నాడు. తన భార్య ప్రియుడు సోనుతో ఉండటం తనకు ఇష్టమేనని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వక ఒప్పంద పత్రాన్ని పోలీస్ స్టేషన్‌లో సమర్పించాడు. తనను ఏమైనా చేస్తుందన్న భయంగా ఉందని.. ఇకపై ఆమెతో కలిసి ఉండలేనని రామ్‌చరణ్ పేర్కొ్న్నాడు.
