High Court: భార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తి విడాకుల పిటిషన్‌ని తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ‘‘చర్మం రంగు ఆధారంగా వివక్ష’’ని నిర్మూలించాలని పిలుపునిచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి తన జీవిత భాగస్వామి తనను విడిచిపెట్టిందని వాదించాడు. అయితే డార్క్ కలర్ కారణంగా అవమానించబడి, ఇంటి నుంచి…