NTV Telugu Site icon

Huchamma Chowdhury: బడికోసం స్థలం దానమిచ్చి వృద్దురాలు ..నిస్వార్ధానికి రాజ్యోత్సవ అవార్డు..

Untitled 12

Untitled 12

Karnataka: ఎంత సంపద ఉన్నది అని కాదు.. మన దగ్గర ఉన్న సంపద సమాజం శ్రేయస్సుకు ఎంత వరకు ఉపయోగపడిందనేదే ముఖ్యం. సంపద ఉండి.. సంపాదించే శక్తి, వయసు ఉండి పరులకు పైసా దానం చెయ్యాలంటే మనం ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మిన ఓ వృద్ధురాలు తనకు ఆసరాగా ఉన్న భూమిని భావిభారత పౌరుల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా దానం చేసింది. బ్రతకు దెరువుకు ఆ పాఠశాల లోనే వంట మనిషిగా చేరి జీవనాన్ని గడుపుతుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం లోని కొప్పాల ప్రాంతానికి చెందిన హుచ్చమ్మ చౌదరికి రాజ్యోత్సవ అవార్డును కర్ణాటక ప్రభుత్వం జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర స్థాపన సందర్భంగా నవంబర్ 1వ తేదీన రాజ్యోత్సవ అవార్డును ప్రదానం చేస్తుంది.

Read also:BSNL Diwali Offer: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా’.. సూపర్ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఇవే!

కాగా ఈ సంవత్సరం కూడా రాజ్యోత్సవ అవార్డులను ప్రకటించింది. కాగా ఈ సంవత్సరం కొప్పాల జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాజ్యోత్సవ అవార్డులు అందుకున్నారు.అవార్డుకు ఎంపికైన వాళ్ళు కొప్పల్ తాలూకాకు చెందిన హుచ్చమ్మ చౌదరి, మోరనాల గ్రామానికి చెందిన తోలు బొమ్మల కళాకారుడు కేశప్ప శిల్లిక్యాతర, కరటగి తాలూకా సిద్ధాపురానికి చెందిన గుండప్ప విభూతి అవార్డుకు ఎంపికయ్యారు. కాగా కొప్పల్ తాలూకాకు చెందిన హుచ్చమ్మ చౌదరి ఈ అవార్డుకు నమోదు చేసుకోలేదు. కానీ ఆమె నిస్వార్ధనికి అవార్డు ఆ వృద్ధురాలిని వెతుకుంటూ వచ్చింది. దీనికి కారణం 68 సంవత్సరాల వయసులో తనకి ఆసరాగా ఉన్న రెండు ఎకరాల పొలంని తన్నూరులోని పాఠశాలకు విరాళంగా ఇచ్చారు.

Read also:OnePlus Watch 2 Launch : సరికొత్త లుక్ లో వన్‌ప్లస్ వాచ్ 2 వచ్చేస్తోంది.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు..

అనంతరం జీవనోపాధి కోసం ఆ పాఠశాల లోనే వంటమనిషిగా చేరారు. అయితే పిల్లలు లేని హుచ్చమ్మ ఆ పాఠశాల పిల్లలే తన పిల్లలుగా భావించి సంతోష పడుతుంది. ఈ నేపథ్యంలో దేశం లోని మఠాలు, సంస్థలు హుచ్చమ్మను వెతుక్కుంటూ వచ్చి అవార్డులతో సత్కరించాయి. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రాజ్యోత్సవ అవార్డును హుచ్చమ్మకు అందించడం జిల్లా వాసుల్లో ఆనందాన్ని నింపింది. కాగా అవార్డు గర్హితకు రూ/ లక్ష నగదుతో పాటుగా 25 గ్రాముల బంగారం అందిస్తారు.