Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది.
Read Also: Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల.. హద్దుదాటి.. షర్ట్ బటన్స్ విప్పి.. దేవుడా
కావాలనే బీజేపీ అల్లర్లను సృష్టిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించగా.. హిందువుల మనోభావాలను విస్మరిస్తున్నారంటూ బీజేపీ విమర్శించింది. అల్లర్లు, కుట్రలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని దీదీ వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చినవారికి అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. రామ నమవి ఊరేగింపుల్లో కత్తులు తీయదానికి మీరు ఎవరు అధికారం, అనుమతి ఇచ్చారు..? హౌరా ర్యాలీలో బుల్డోజర్లు ఉపయోగించారని ఎంత ధైర్యమని ప్రశ్నించారు.
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ఊరేగింపు వెల్లడంపై మమతా బెనర్జీ హెచ్చరించారు. ముస్లింలకు రంజాన్ మాసమని, ఏదైనా జరిగితే హింస చెలరేగుతుందని ముందే హెచ్చరించారు. బెంగాల్ లో హింస కాల్పులపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. హిందువుల మనోభావాలను విస్మరిస్తూ మమతా బెనర్జీ శ్రీరామ నవమి రోజు ధర్నా చేశారని.. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలకు దూరంగా ఉండాలని హిందువులను హెచ్చరించారని, ఆమె హిందువులను మరిచిపోయిందని అన్నారు. బెంగాల్ హోంమంత్రి హౌరా హింసకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతేడాది కూడా ఇలాగే అల్లర్లు చెలరేగాయని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారి విమర్శించారు.