NTV Telugu Site icon

BJP: శ్రద్ధా వాకర్‌కు న్యాయం జరగలేదు.. ఇప్పుడు మరో హిందూ బాలికను బలైంది.

Kapil Mishra

Kapil Mishra

BJP: ఢిల్లీలో యువకుడి చేతిలో హత్యకు గురైన 16 ఏళ్ల అమ్మాయి ఉదంతం పొలిటికల్ ఇష్యూగా మారుతోంది. 16 ఏళ్ల హిందూ బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా అన్నారు. ఢిల్లీలో ఎన్నో ‘కేరళ స్టోరీలు’ ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ ఉదంతాన్ని ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో ముడిపెట్టారు. దీనిపై స్పందించిన ఆమయన ‘‘ ఈ బాధాకరమైన హత్య ఢిల్లీలో జరిగింది. మరో మైనర్ హిందూ బాలికను చంపేశారు. నిందితుడు సాహిల్ S/O సర్ఫరాజ్.ఢిల్లీ బైలేన్‌లలో ఎన్ని కేరళ కథలు ఉన్నాయి? శ్రద్ధాకు ఇంకా న్యాయం జరగలేదు మరియు ప్రతిరోజూ ఎంత మంది శ్రద్దలు ఈ క్రూరత్వానికి గురవుతున్నారో తెలియదు. ” అంటూ ట్వీట్ చేశారు.

Read Also: Maharastra: భార్య పిల్లలను కనడం లేదని కిరాతకంగా చంపిన భర్త

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని షహబాద్ డైరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను ఆమె ఇంటి వెలుపల సాహిల్ అనే వ్యక్తి 20 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచాడు. కత్తి తలలో గుచ్చుకుని ఇరుక్కుపోయిన తర్వాత కూడా ఆగకుండా బండరాయితో మోది అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చట్టు పక్కల జన సంచారం ఉన్నా కూడా ఎవరూ ఈ దారుణమైన హత్యను ఆపే ప్రయత్నం చేశాయలేదు. ప్రస్తుతం నిందితుడు సాహిల్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం.

Show comments