NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్ర, పత్తి పరిశ్రమలపై ఎలా ప్రభావం చూపిస్తోంది..?

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితులు, ఉద్రిక్తతలు భారత వస్త్ర వ్యాపారం, పత్తి ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ వ్యాపారానికి బంగ్లాదేశ్ కేంద్రంగా ఉంది. అయితే, ఇటీవల హింసాత్మక అల్లర్లు, రాజకీయ అస్థిరత అక్కడి పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కొత్త ఆర్డర్లను నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బంగ్లాదేశ్‌కి ముడి పదార్థాలను సరఫరా చేసే దేశంగా ఉన్న భారత్‌పై ప్రభావం చూపిస్తుంది.

భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కి పత్తి ఎగుమతి అవుతుంది. భారతదేశం ఏడాదికి 2.4 బిలియన్ల విలువైన పత్తిని ఆ దేశానికి ఎగుమతి చేస్తుంది. భారత్ మొత్తం పత్తి ఎగుమతుల్లో బంగ్లాదేశ్ వాటా ఆర్థిక సంవత్సరం 2013 నుంచి 2024 పోల్చి చూస్తే 16.8 శాతం నుంచి 34.7 శాతానికి పెరిగింది. 2024లో బంగ్లాదేశ్‌కి భారత్ చేసిన ఎగుమతుల్లో నాలుగో వంతు భాగం ముడిపత్తి ఉంది.

Read Also: Shreya Ghoshal: ‘‘వెన్నులో వణుకు పుట్టిస్తోంది’’..కోల్‌కతా ఘటనపై శ్రేయా ఘోషల్ స్పందన..

అయితే, బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్రపరిశ్రమకు కొంత బూస్ట్ ఇస్తోంది. భారత్ వస్త్ర ఉత్పత్తి కోసం తాజాగా పలు ఆర్డర్లకు సంబంధించి విచారణలను స్వీకరించడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే, భారత్ నుంచి బంగ్లాదేశ్‌కి పత్తి ఎగుమతులు క్షీణిస్తున్నాయి. నిజానికి బంగ్లాదేశ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీకి భారత్ ప్రత్యామ్యాయంగా విదేశాలు చూస్తున్నాయి. అయితే, బంగ్లాదేశ్ గుణాత్మ, పరిణాత్మక డిమాండ్లను తీర్చడంలో భారతీయ వస్త్రపరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటుందని న్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) సెక్రటరీ జనరల్ చంద్రిమా ఛటర్జీ చెప్పారు. అయితే, భారతదేశం యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం మరియు PM మిత్రా పథకం దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి సానుకూల చర్యలు అని ఆమె హైలైట్ చేసింది.

బంగ్లాదేశ్‌లో మానవ హక్కుల సమస్య గురించి పాశ్చాత్య మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆ మార్కెట్లకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారింది. బంగ్లాదేశ్‌లో 45 బిలియన్ డాలర్ల వస్త్ర పరిశ్రమను, 4 మిలియన్లకు పైగా కార్మికులను కలిగి ఉంది. అయితే, ఆ దేశంలో బలహీనమైన విద్యుత్ ఉత్పత్తి అవస్థాపన, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, వరదలు-తుఫానుల వంటి ప్రతీకూల వాతావరణ పరిస్థితులతో పోరాడుతోంది.