NTV Telugu Site icon

Kangana Ranaut: ఇజ్రాయిల్‌కి మద్దతుగా రాయబారిని కలిసిన కంగనా రనౌత్..

Kangana

Kangana

Kangana Ranaut: నటి కంగనా రనౌత్ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలిపారు. బుధవారం ఆమె భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నవోల్ గిలోన్‌ని కలిశారు. ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన విషయాలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ విజయం సాధింస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి శ్రీ నూర్ గిలోన్ జీతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ రోజు ప్రపంచం మొత్తం, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.నిన్న నేను రాహన దహనం కోసం ఢిల్లీలో ఉన్నాను. నేటి ఆధునిక రావణుడు హమాస్ లాంటి ఉగ్రవాదులు ఏరివేస్తున్న ఇజ్రాయిల్ రాయబారిని కలవాలని నిన్న అనుకున్నాను. చిన్న పిల్లలను, మహిళల్ని టార్గెట్ చేస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. ఈ టెర్రరిజంపై ఇజ్రాయిల్ యుద్ధంలో విజయం సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. తనతో నా అప్ కమింగ్ సినిమా ‘తేజస్’ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఫైటర్ జెట్ తేజస్ గురించి చర్చించాను’’ అని కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

Read Also: Iran: “హిజాబ్” ఉల్లంఘన.. సినిమాల్లో నటించకుండా 12 మందిపై నిషేధం..

తనను కలిసేందుకు వచ్చని కంగనా రనౌత్ ఫోటోలను ఇజ్రాయిల్ రాయబారి నవోర్ గిలోన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆమె ఇజ్రాయిల్ కి మద్దతు తెలపడం, రాయబార కార్యాలయాన్ని సందర్శించడం మాకెంతో ప్రత్యేకమైందని, తనకే కాకుండా ప్రధాని నరేంద్రమోడీకి, ఉగ్రవాదంలో వ్యతిరేకంగా తిరుగులేని మద్దతు కోసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపానంటూ ఆయన కామెంట్స్ చేశారు.

భారతదేశంలో ఇజ్రాయిల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ హిషన్, ఓహద్ నకాష్ కైనార్ కూడా కంగనా సమావేశమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ భయంకర సమయంలో కొంతమంది మద్దతు ధైర్యంగా ఉంది. దానికి వేరే పదం లేదు. కంగనాలా నిజం చెప్పేందుకు ధైర్యం కావాలని ఇజ్రాయిల్, భారత్ ఒకే విలువలను, ధైర్యాన్ని పంచుకుంటాయి, జైఇజ్రాయిల్, జైహింద్ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. పిల్లలు, మహిళలతో సహా 1400 మందిని చంపేశారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో సహా సాధారణ ప్రజలు మొత్తంగా 5700 మంది మరణించారు.